ఆజాద్ వద్దకు కాంగ్రెస్ నేతల క్యూ: ట్రబుల్ షూటర్‌ను కలిసిన గద్దర్

కాగా ఆజాద్‌ను కలిసిన అనంతరం గద్దర్ విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని కాంగ్రెసు ప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన తెలంగాణ ప్రకటనకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. నాడు కాంగ్రెసు సోనియా పుట్టిన రోజు కానుకగా తెలంగాణ ప్రకటించిందని ఆందరూ భావించారని, కానీ ఆ తర్వాత దానిని వెనక్కి తీసుకోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రాష్ట్రం దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. చెన్నారెడ్డి సమయంలోని తెలంగాణ ఉద్యమం నాయకుల చేతుల్లో ఉండేదని, ఇప్పటి ఉద్యమం ప్రజల చేతుల్లో ఉందన్నారు.












Click it and Unblock the Notifications