వైయస్ జగన్ దీక్షకు తగ్గిన ఎమ్మెల్యేలు, 19 మంది మాత్రమే హాజరు

YS Jagan
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దీక్షకు ఈసారి శాసనసభ్యుల హాజరు సంఖ్య తగ్గింది. గుంటూరు రైతు దీక్షకు 19 మంది శాసనసభ్యులు మాత్రమే హాజరయ్యారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరిగిన జగన్ దీక్షకు 30 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. గుంటూరు దీక్షకు శాసనసభ్యులు జయసుధ, ఆళ్ల నాని, పేర్ని నాని, శోభా నాగిరెడ్డి, కమలమ్మ, గుర్నాథ రెడ్డి, షాజహాన్, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బాలనాగిరెడ్డి, కుంజా సత్యవతి, బాలనాగిరెడ్డి జగన్ దీక్షకు గైర్హాజరయ్యారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ రాష్ట్రంలో ఉండడం వల్లనే వైయస్ జగన్ దీక్షకు హాజరు తగ్గిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కాగా, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి దీక్షకు హాజరయ్యారు. ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర రావు, కొండా మురళి దీక్షలో పాల్గొన్నారు. శాసనసభ్యులు కొండా సురేఖ, బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, బాలరాజు, బాబూరావు, శేషా రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, ప్రసాదరాజు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కొర్ల భారతి వంటి శాసనసభ్యులు దీక్షకు హాజరయ్యారు.

కమలమ్మ ఇప్పటికే వైయస్ జగన్‌కు దూరమయ్యారు. అలాగే, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు కాటసాని రాంరెడ్డి కూడా వెనక్కి వచ్చారు. పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, షాజహాన్, రవి వంటి శానససభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+