వైయస్ జగన్‌కు చాలా భయం పట్టుకుంది: పయ్యావుల కేశవ్

కాంగ్రెసుతో జగన్ ఒప్పందం కుదుర్చుకున్నారని, అందులో భాగంగానే గుంటూరు జిల్లాలోని రైతు దీక్షలో కేవలం చంద్రబాబునాయుడుని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారని ఆరోపించారు. కాంగ్రెసు, జగన్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందనడానికి కేంద్ర మంత్రులు ఆంటోనీ, చిదంబరం వ్యాఖ్యలే మంచి నిదర్శనం అన్నారు. 2జి కుంభకోణంలో రాజా, కనిమొళి, కామన్వెల్తు క్రీడల అవినీతిలో సురేష్ కల్మాడీపే చర్యలు తీసుకున్న కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం జగన్ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కేవలం వారి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నందువల్లే ఆయనపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.












Click it and Unblock the Notifications