గులాం నబీ ఆజాద్‌ను లెక్క చేయని వైయస్ జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలు

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యులు పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు సవాల్ విసురుతున్నారు. పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడానికి హైదరాబాదు వచ్చిన ఆజాద్‌ను లెక్క చేయకుండా వారు గుంటూరులో రైతు సమస్యలపై దీక్ష చేస్తున్న జగన్ చెంతకు చేరుకున్నారు. తమపై చర్యలు తీసుకునే దమ్ము పార్టీ నాయకత్వానికి లేదంటున్న వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు పార్టీ అధిష్టానానికి బహిరంగంగానే సవాల్ విసురుతున్నారని చెప్పవచ్చు. ఇది ఒక రకంగా ఆజాద్‌కు ఇబ్బందికరమైన పరిస్థితే.

మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుడు, శాసనసభ్యుడు కృష్ణదాస్ జగన్ దీక్షకు వెళ్లి తనకు సోనియా గాంధీ అంటే ఎవరో తెలియదని, తనకు వైయస్ రాజశేఖర రెడ్డి మాత్రమే తెలుసునని అన్నారు. ఆజాద్ విషయం తనకు తెలియదని పిల్లి సుభాష్ చంద్ర బోస్ అన్నారు. ఆజాద్ హైదరాబాదుకు చేరుకున్న రోజునే జగన్ దీక్షకు 17 మంది శాసనసభ్యులు వెళ్లారు. పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, నలుగురు ఎమ్మెల్సీలు కూడా జగన్ దీక్ష వద్దనే ఉన్నారు. దీన్ని బట్టి కాంగ్రెసు అధిష్టానం తీసుకునే చర్యలకు తాము భయపడడం లేదని జగన్ వర్గం శాసనసభ్యులు సవాల్ విసురుతున్నట్లుగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+