లాడెన్ ఎఫెక్ట్: పాక్‌లోని భారత రాయబారులకు బుల్లెట్-ప్రూఫ్ కార్లు

ఈ మేరకు అధికారులు నిర్వహించిన భద్రతా సమీక్షలో ఇస్లామాబాద్‌లోని ఇండియన్ హై కమిషన్‌లో పనిచేస్తున్న అధికారులు పాక్‌లో అనవసర ప్రయాణాలను మానుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు భద్రతా సిబ్బందితో వెళ్లాలని జాగ్రత్తలు సూచించింది. ఈ సోమవారం ఓ సౌదీ రాయబారి కారులో వెళ్తుండగా తాలిబన్ తీవ్రవాదులు కాల్చిచంపడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమై ఈ చర్య తీసుకుంది.
అయితే పాకిస్థాన్‌లోని భారత దౌత్యవేత్తలకు ఎలాంటి ముప్పు పొంచి ఉన్నట్లు ఇంత వరకూ ఇంటెలిజెన్స్‌కు ఎలాంటి సమాచారం లేదు. ముందస్తు చర్యల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లోని హై కమిషన్ కాంప్లెక్స్ చుట్టూ భద్రతను కూడా అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు.












Click it and Unblock the Notifications