వైయస్ జగన్ తెలంగాణ వైఖరి: తెలంగాణ మంత్రులపై కన్ను

తెలంగాణ సమస్య అడ్డు రాకపోతే ఈ ప్రాంతంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి గణనీయమైన ఆదరణ ఉంది. జగన్ వెంట నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ స్థితిలో కప్పదాటు వైఖరితో తనకున్న అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకునేందుకు వ్యూహం సిద్ధం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇదే సమయంలో కొంత మంది తెలంగాణ మంత్రులకు కూడా ఆయన గాలం వేస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ సాధన కోసం పాదయాత్ర చేస్తున్న జూపల్లి కృష్ణారావు, నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి మంత్రులను తన వైపు తిప్పుకునేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు వ్యతిరేకంగా ఉన్న నాయకులను కూడా ఆయన గుర్తించే పనిలో పడ్డారు. వారిని తన వైపు తిప్పుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం దాదాపుగా కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఉంది. వీరు వైయస్ జగన్ వెంట వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు. సీమాంధ్రలో తనకు తిరుగులేదని ఇప్పటికే జగన్ భావిస్తున్నారు. తెలంగాణలో పాగా వేయగలితే తనకు అధికారం దక్కడం ఖాయమని ఆయన ఓ అంచనా వచ్చినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications