కళ్యాణమస్తులో కర్కాటక లగ్నాన ఒక్కటైన 12వేల జంటలు

Kiran Kumar Reddy
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కళ్యాణమస్తులో భాగంగా శుక్రవారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా 12వేల మంది జంటలు ఒక్కటయ్యాయి. శుక్రవారం ఉదయం గం.9.52 నిమిషాల నుండి గం.10.04 నిమిషాల మధ్య కర్కాటక లగ్న పుష్కరాంశ ముహూర్తాన ఈ జంటలు ఒక్కటయ్యాయి. కాగా హైదరాబాదులోని లలిత కళా తోరణంలో జరిగిన కళ్యాణమస్తుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయి వధూవరులను ఆశీర్వదించారు. జంటలకు టిటిడి ఉచితంగా మంగళ సూత్రాలు అందించింది.

కాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరుగుతున్న కళ్యాణమస్తులో ఓ మైనర్ పెళ్లిని అధికారులు ఆపారు. వధూవరుల తల్లిదండ్రులు వయసు ధృవీకరణ పత్రాలు తీసుకు రాలేదు. తల్లిదండ్రులు రాక పోవడంతో అధికారులు కాసేపు వేచి చూశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+