వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తీర్పు వినగానే స్పృహ తప్పి పడిపోయిన డిఎంకె ఎంపి కనిమొళి

కనిమొళిని అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. తాను ఎదుర్కుంటానని, భయపడేది లేదని ఆమె అన్నారు. కలైంగర్ టీవీ చానెల్‌లో తాను వాటాదారును మాత్రమేనని, తనకు ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేదని కనిమొళి చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. 2జి స్పెక్ట్రమ్ స్కామ్‌లో టెలికం మాజీ మంత్రి ఎ రాజాతో కనిమొళి కుమ్మక్కయి, 200 కోట్ల రూపాయలకు పైగా ముడుపులు తీసుకున్నట్లు సిబిఐ ఆరోపించింది. కరుణానిధికి కనిమొళి మూడో భార్య కూతురు. జైలులో కనిమొళికి ప్రత్యేక ఏర్పాట్లు ఏవీ లేవని అధికారులు చెప్పారు.