ఇరుకున పడిన కరుణానిధి, కక్కలేని మింగలేని పరిస్థితి

డిఎంకె యుపిఎ నుంచి వైదొలిగి తమ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నా ఫరవా లేదనే స్థితికి కాంగ్రెసు అధిష్టానం ఎప్పుడో చేరుకుంది. అవసరమైతే అన్నాడియంకె మద్దతు తీసుకోవాలనే ఆలోచనలో కూడా ఉంది. అందులో భాగంగానే తమిళనాడు శానససభ ఎన్నికల్లో గెలుపొందగానే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కాంగ్రెసు అధ్యక్షురాలు టీ పార్టీకి ఆహ్వానించారు. జయలలితను సోనియా టీ పార్టీకి అహ్వానించడం కూడా కరుణానిధికి మింగుడు పడడం లేదు.
తన సాహిత్య వారసురాలిగా ముందుకు వచ్చిన తన ముద్దుల కూతురు కనిమొళి అరెస్టు కావడం వ్యక్తిగతంగా కరుణానిధి తనకు పెద్ద దెబ్బగానే భావిస్తారు. అయితే, కాంగ్రెసుతో డిఎంకెతో అంత సఖ్యతగా మెలిగే అవకాశం లేదు. విభేదాలతోనే యుపిఎలోనే కొనసాగాలని కరుణానిధి నిర్ణయించుకోవచ్చు. బెదిరించి పని చక్కబెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి దగ్గరగా ఉంటూ పనులు చక్కబెట్టుకునే అవకాశాల కోసమే ఆయన ఆలోచించవచ్చు.












Click it and Unblock the Notifications