వైయస్ జగన్ విమర్శలపై పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ కామెంట్స్
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ స్పందించారు. తొంబై మంది శానససభ్యులతో ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏం చేస్తారని ఆయన అడిగారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ కుమ్మక్కయ్యాయని జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు డికె అరుణ, జూపల్లి కృష్ణారావు మధ్య చెలరేగిన ఘర్షణను ఆయన తీవ్రంగా పరిగణించలేదు. మంత్రుల మధ్య విభేదాలు సహజమేనని ఆయన అన్నారు. మంత్రుల మధ్య ఆధిపత్య పోరు లేదని, సమాచార లోపం వల్లనే సమస్య తలెత్తిందని ఆయన అన్నారు. సమస్య సర్దుకుంటుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం యేటా పునరంకిత సభ నిర్వహించాలని ఏమీ లేదని, ప్రస్తుత పరిస్థితిలో పునరంకిత సభ అవసరం లేదని ప్రభుత్వం భావించి ఉంటుందని ఆయన అన్నారు.