మంత్రి జూపల్లి కృష్ణారావు అరెస్టు, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు

కృష్ణారావు అరెస్టును ప్రతిఘటించడానికి ఆయన అనుచరులు ప్రయత్నించారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే, ఎట్టకేలకు అరెస్టు చేశారు. తన పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మంత్రి డికె అరుణపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డికె ఆరుణ సీమాంధ్రులతో కలిసిపోయారని ఆయన ఆరోపించారు. ఆరు నూరైనా తన పాదయాత్ర కొనసాగుతుందని ఆయన అన్నారు. తన అరెస్టు ప్రజాస్వామ్య ఖూనీ ఆయన అన్నారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్దమని ఆయన ప్రకటించారు. అరెస్టు చేసి తనను లొంగదీసుకోలేరని ఆయన అన్నారు. తనకు ఎవరిపైనా కక్ష లేదని ఆయన అన్నారు. తన పాదయాత్రను అడ్డుకున్న విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications