చిరంజీవి పంట పండుతుందా, కోర్ కమిటీలోకి తీసుకుంటారా?

ఇటీవల ఢిల్లీ వెళ్లిన చిరంజీవికి సోనియా అపాయింట్‌మెంట్ కూడా లభించలేదనే వార్తలు వచ్చాయి. ఆయనను తగిన విధంగా గుర్తించడం లేదనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. అయితే, ఆయన ప్రాధాన్యం ఏమీ తగ్గలేదని అంటున్నారు. చిరంజీవికి పార్టీ పదవి ఇవ్వాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, చిరంజీవి మాత్రం కేంద్ర మంత్రివర్గంలో స్థానాన్ని కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. జూన్‌లో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని అంచనాలు వేస్తున్నారు. ఈ విస్తరణలో ప్రజారాజ్యం పార్టీకి చెందినవారికి మంత్రి పదవులు ఇస్తారని అంటున్నారు. ఏమైనా, చిరంజీవి భవిష్యత్తు ఇంకా డోలాయమానంలోనే ఉంది.












Click it and Unblock the Notifications