పంది కడుపులో జన్మించిన ఏనుగు పిల్ల: కరీనంగర్‌లో వింత
Districts
oi-Srinivas G
By Srinivas
|
కరీంనగర్: పంది కడుపులో ఏనుగు పిల్ల జన్మించిన వింత సంఘటన సోమవారం కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కథలాపూర్ గ్రామంలో ఓ పంది ఏనుగు పిల్లకు జన్మనిచ్చింది. పందికి ఏనుగు పిల్ల జన్మించడం పట్ల స్థానికులు తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యారు. దీంతో గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామస్తులు తండోపతండాలుగా ఆ వింతను చూడటానికి కథలాపూర్ వస్తున్నారు. అంతా బ్రహ్మంగారు చెప్పినట్లుగా జరుగుతుందని వారు అనుకోవడం విశేషం.
కాగా పంది కడుపులో ఏనుగు పిల్ల జన్మించడంలో భగవంతుడి మాయ మర్మాలు ఏమీ లేవని, జంతువులలోని జన్యులోపాల కారణంగా వికృక రూపంలో జన్మించి ఉండవచ్చని విజ్ఞాన వేత్తలు అభిప్రాయ పడుతున్నారు. పంది కడుపులో ఏనుగు పిల్ల కాదని జన్యు లోపం కారణంగానే ఏనుగు రూపంలో పంది జన్మనిచ్చిందని వారు అంటున్నారు. అర గంట తర్వాత ఏనుగు పిల్ల చనిపోయింది.