మావోల దాడిలో ఎఎఎస్పీ సహా పది మంది పోలీసుల మృతి

Maoists
భువనేశ్వర్: పోలీసులపై ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు సోమవారం రాత్రి దాడి చేశారు. ఒరిస్సా- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటనలో ఝరియాబాగ్‌ ఏఎస్పీ రాజేష్‌ పవార్‌తోపాటు మరో 9 మంది పోలీసులు మృతి చెందారు. కూంబింగ్‌కు వెళ్లి తిరిగి వస్తున్న పోలీసులపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. కూంబింగ్‌లో అలసి వాహనంలో వస్తున్న పోలీసులపై మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో వాహనం నిలిపివేసిన పోలీసు ల్యాండ్‌మైన్‌ ధాటికి మృత్యువాత పడ్డారు. మరికొందరు పోలీసులు ఈ కాల్పుల నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

రాత్రి వేళలో ఈ సంఘటన జరగడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లలేదు. ఒరిస్సా సరిహద్దుల్లోని మల్కన్‌గిరి- కోరాపుట్‌ డివిజన్‌కు ఆనుకుని ఉన్న ఝరియాబాగ్‌ బ్లాక్‌లోని అమాములా-దాతునామా అటవీ ప్రాంతంలోని దండకారణ్య స్పెషల్‌ జోన్‌లో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిపై రాయ్‌పూర్‌కూ సమాచారం అందినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+