నాగం జనార్దన్ రెడ్డి వ్యవహారంపై చంద్రబాబు నో కామెంట్

తాను రైతు సమస్యలపై ఢిల్లీకి వచ్చానని, ఈ సందర్భంలో రాజకీయాలు మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. నాగం జనార్దన్ రెడ్డి వ్యవహారంపై మాట్లాడడానికి ఇంకా చాలా సమయం ఉందని ఆయన చెప్పారు. ఆ వ్యవహారంపై తాను హైదరాబాదులో మాట్లాడుతానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై సమయం వచ్చినప్పుడు తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications