హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవికి లైన్ క్లియర్ చేయడానికే బొత్సకు పిసిసి పదవి ఇస్తున్నారా!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ఇటీవలే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తానని అధికారికంగా ప్రకటించిన చిరంజీవికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్రంలో ఎక్కువమంది అభిమానులు కలిగి ఉండటంతో పాటు ఆయన సామాజిక వర్గం కూడా రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉండటం కారణంగానే కాంగ్రెసు జగన్‌కు ప్రత్యామ్నాయంగా చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానించింది. చిరంజీవి కాంగ్రెసు పార్టీలోకి 2014లో ముఖ్యమంత్రి స్థానం కేటాయిస్తారనే హామీతోనే పార్టీలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెడ్ల ప్రాధాన్యత ఉన్న కాంగ్రెసు పార్టీలో గత దశాబ్దాలుగా తమ సామాజిక వర్గం వారిని అట్టి పెట్టి ఉంచిన చిరంజీవి సామాజిక వర్గం నేతలకు చిరు ఎంట్రీ బాధించేదిగానే ఉంటుంది. అంతేకాకుండా బొత్స సత్యనారాయణ వంటి నేత పేరు ముఖ్యమంత్రి పదవికి కూడా వినిపించిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పటికైనా తాము అత్యున్నత స్థానంలో కూర్చుంటామని అనుకున్న బొత్స సత్యనారాయణ, వట్టి వసంత్ కుమార్, కన్నా లక్ష్మీనారాయణలకు చిరు ఎంట్రీ రుచించక పోవచ్చు.

అంతేకాదు తెలంగాణలో అదే సామాజిక వర్గానికి చెందిన వి హనుమంతరావు, కె కేశవరావు వంటి నేతల ప్రాధాన్యత కూడా తగ్గవచ్చు. ఈ నేపథ్యంలో చిరు ఎంట్రీ ఎవరికీ నచ్చదనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన బొత్సకు చిరు ఎంట్రీ షాక్‌కు గురి చేసేదే. వీరెవరూ చిరు ఎంట్రీని ఆమోదించే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే పార్టీ అధిష్టానం వారికి ముఖ్యమైన పదవులు ఎరవేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే బొత్స సత్యనారాయణ పేరు పిసిసి అధ్యక్ష పదవికి వినిపిస్తుంది. బొత్స దారిలోనే వట్టి, కన్నలను కూడా ప్రాధాన్యత ఉన్న పోస్టులలో కూర్చుండ బెట్టాలని అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. పదవులతో వారిని ఇప్పటి నుండే తమ దారిలోకి తెచ్చుకోవడం ద్వారా ముందు ముందు చిరంజీవిపై వారి వ్యతిరేకత తగ్గించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమలోని పలు జిల్లాల్లో కాపు, తెలగ, మున్నూరు కాపుల ప్రభావం ఎక్కువ. వారందరినీ కాంగ్రెసు వైపుకు రప్పించుకోవాలంటే చిరంజీవిని దరి చేర్చుకోవడమే ఉత్తమమని భావించిన పార్టీ ఆ దిశలో అడుగులు వేసి సక్సెస్ అయింది. అయితే ఇప్పటికే పార్టీలో ఉన్న సదరు సామాజిక వర్గం నేతలు వారి వారి జిల్లా, నియోజకవర్గాల్లో ప్రాధాన్యత. మరికొందరికి ఫాలోయింగ్ ఏమాత్రం లేదనే చెప్పవచ్చు. అలాంటి నేతలను నమ్మకోవడం కంటే చిరంజీవిని నమ్ముకోవడం ఉత్తమమని భావించిన కాంగ్రెసు పీఆర్పీని కాంగ్రెసులో విలీనం చేసుకొని 2014 సిఎంగా చిరంజీవిని తెరపైకి తెచ్చే వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తోంది.

English summary
Congress high command is going with a great strategy on chiranjeevi's PRP merger issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X