మరింత కాలం కనిమొళికి జైలే, సిబిఐకి హైకోర్టు నోటీసు

కనిమొళి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు సిబిఐకి నోటీసు జారీ చేసింది. కనిమొళి, శరద్ కుమార్ బెయిల్ పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించి వారిద్దరిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సిబిఐ మోపిన అభియోగాల్లో నిజం లేదని కనిమొళి తరఫు న్యాయవాది వాదించారు. తాను పిల్లల తల్లినని, వారి బాగోగులు చూడాల్సిన అవసరం ఉందని, అందువల్ల తనకు బెయిల్ మంజూరు చేయాలని కనిమొళి తన బెయిల్ పిటిషన్‌లో చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications