నారా లోకేష్‌కు జూ. ఎన్టీఆర్ కౌంటర్, కృష్ణా జిల్లా నుంచి ఎంట్రీ

కృష్ణా జిల్లాలోని ఏదో ఒక శాసనసభా నియోజక వర్గం ఇంచార్జీగా జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రకటించాలని కోరుతూ జిల్లా నాయకత్వం తీర్మానం చేయడానికి సిద్ధపడుతోంది. మంగళవారం మధ్యాహ్నం బందరులో కృష్ణా జిల్లా పార్టీ సమావేశం జరుగుతోంది. ఇందులో మహానాడులో ప్రతిపాదించే తీర్మానాలపై చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్‌ను ఏదో ఒక నియోజకవర్గం ఇంచార్జీగా నియమించాలనే తీర్మానం పురుడు పోసుకుంటుందని అంటున్నారు. తాత స్వర్గీయ ఎన్టీఆర్ సొంత జిల్లా కృష్ణా నుంచి జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ ప్రవేశం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ఇంచార్జీగా వ్యవహరించడానికి అనువైన నియోజకవర్గాన్ని కూడా పార్టీ నాయకులు గుర్తించనున్నారు.
తన కుమారుడు లోకేష్‌ను చంద్రగిరి నియోజక వర్గం ఇంచార్జీగా నియమించాలనే చిత్తూరు జిల్లా పార్టీ నాయకుల ఒత్తిడిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. పార్టీని బలోపేతం చేయాల్సిన తరుణంలో వారసత్వ పోరు రగలడం చంద్రబాబుకు కాస్తా ఇబ్బందిగానే ఉందని చెబుతున్నారు. తెలంగాణకు సంబంధించి నాగం జనార్దన్ రెడ్డి వ్యవహారం తలనొప్పిగా పరిణమించింది. ఇదే సమయంలో వారసత్వ పోరు కొత్త మార్గంలో తలకు చుట్టుకుంటుండడం చంద్రబాబు అసహనానికి కారణమని అంటున్నారు.












Click it and Unblock the Notifications