తనయుడి బాటలో తండ్రి: వైయస్ జగన్ పార్టీలోకి మంత్రి కాసు?

Kasu Venkata Krishna Reddy
హైదరాబాద్: మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి త్వరలో వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కాసు తనయుడు కాసు మహేష్ రెడ్డి జగన్ పార్టీలో ఉన్నారు. అయితే కాసు నియోజకవర్గంలో ఆయన కార్యకర్తలు తండ్రిని కూడా తనయుడి బాటలోనే నడవమంటున్నారని తెలుస్తోంది. కాసుపై అనుచరులతో పాటు తనయుడు మహేష్ రెడ్డి కూడా ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. కాసును కాంగ్రెసు పార్టీ నుండి జగన్ పార్టీలోకి తీసుకు రావడానికి వారు తీవ్రంగా చేసిన ప్రయత్నాలు ఫలించినట్లుగా కనిపిస్తున్నాయి. ఇటీవల నియోజకవర్గంలోని ఓ సమావేశంలో కాసు కొడుకు ఓ పార్టీలో తండ్రి ఓ పార్టీలో ఉంటే మంచిది కాదని అనుచరులతో అన్నారని, దానికి అనుచరులు మీరే జగన్ పార్టీలోకి రండి అని చెప్పినట్లుగా తెలుస్తోంది. తనయుడు, అనుచరుల ఒత్తిడి మేరకు ఎట్టకేలకు త్వరలో కాసు మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది.

వచ్చే నెలలో మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరాలని అనుకున్నప్పటికీ అనుచరుల ఒత్తిడి తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆయన అంతకుముందే జగన్‌తో వెళ్లే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, కాసుకు మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో రెడ్డి కాంగ్రెసు పార్టీలో వైయస్‌కు సీటు రావడానికి కూడా కాసు కృషి చేశారంట. వైయస్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలో అయినా కాసు జగన్ పార్టీలోకి వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు జగన్ పార్టీలో చేరతారనే వార్తలను కూడా పలువురు కొట్టి వేస్తున్నారు. జగన్ వర్గం ఉద్దేశ్యపూర్వకంగానే కార్యకర్తలను అయోమయానికి గురి చేయడానికి తమ పార్టీలో చేరతారనే మైండ్ గేమ్ ఆడుతుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+