హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుపై ప్రజల్లో విశ్వాసం పోయింది, కాపాడుకోవాలి: నాగం జనార్దన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: పార్టీలోని సమైక్యవాదులు, అవకాశవాదులు కలిసి తనపై చర్య తీసుకోవాలని కోరుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశానని, ఇప్పుడు కూడా తెలంగాణ ప్రాంతంలో పార్టీని రక్షించుకునే ప్రయత్నమే చేస్తున్నానని ఆయన సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తనపై చర్య తీసుకునే ముందు తాను చేసిన తప్పేంటో చెప్పాలన్నారు.

పార్టీ 2008లో ప్రత్యేక తెలంగాణ తీర్మానం చేసిందని, ఆ కాపీనే కేంద్ర హోంమంత్రికి ఇవ్వాలని కోరుతున్నామన్నారు. సీమాంధ్ర నాయకులే పార్టీ విధాన నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తించారని, వారిపై చర్య తీసుకోకుండా తనపై ఎలా తీసుకుంటారని నిలదీశారు. పార్టీపై ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం పోయిందని, చంద్రబాబునాయుడు తన విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఆనాడు దేవేందర్‌గౌడ్‌ పార్టీ నుంచి వెళ్తే ఏమైందో ఇప్పుడు కూడా అదే అవుతుందంటూ కొందరు నాయకులు మాట్లాడడం సరికాదని, దేవేందర్‌గౌడ్‌ వెళ్లినపుడు ఉన్న పరిస్థితులు వేరని, ఇప్పుడు వేరని నాగం వివరించారు. దేవేందర్‌గౌడ్‌ తన పార్టీని ఇప్పటికీ అలాగే ఉంచి ఉంటే తెలుగుదేశం నుంచి వెళ్తున్నవారు అందులోకే వెళ్లేవారని చెప్పారు. కేసీఆర్‌ కూడా పార్టీ నుంచి వెళ్లేనాటికి ఒక్కరే అని, కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు ఆయనే కారణమయ్యారని చెప్పారు. తన భవిష్యత్‌ కార్యాచరణను కాలమే నిర్ణయిస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేయడానికి పార్టీలే అవసరం లేదన్నారు.

English summary
TDP senior leader Nagam Janardhan Reddy said that his party has lost confidence in Telangana people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X