హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు లేఖ రాస్తే నష్టమేమిటి, పార్టీ పెట్టేది లేదు: నాగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నాయకులు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి మంగళవారం ఓ టీవీ ఇంటర్వ్యూలో అన్నారు. తెలుగుదేశం తెలంగాణ నాయకుల్లో కొంతమందికి తెలంగాణ రాదనే అపోహ ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీలో నాయకులు తనపై చర్చించిన విషయాలు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముప్పయ్యేళ్ల పాటు పార్టీ ఎదుగుదలకు కృషి చేసిన నాకు పార్టీ ఇచ్చే బహుమతి చర్యలు తీసుకోవడమా అని ఆయన ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలోనే తెలంగాణకు వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతున్నా అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ప్రణబ్‌కు రాసినట్టుగానే చిదంబరానికి తెలంగాణపై చంద్రబాబు లేఖ రాస్తే నష్టమేమిటని ఆయన ప్రశ్నించారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రజల ఎజెండా మేరకే తాను నడుచుకుంటానని స్పష్టం చేశారు. తనను పార్టీ బహిష్కరించినా పార్టీ మాత్రం పెట్టనని స్పష్టం చేశారు. ఏ పార్టీతో వెళ్లకుండా సొంతగా ప్రజలలోకి వెళతానని అన్నారు. తనపై చర్యలు తీసుకున్నా ఉద్యమం చేస్తానని చెప్పారు. టిడిపి తెలంగాణ ఫోరం తప్పు చేస్తుందని అన్నారు. ఉద్యమం చిత్తశుద్దితో చేస్తే ప్రజలు నమ్ముతారన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికల తర్వాత పార్టీ ఘోరంగా దెబ్బతిన్నదని అన్నారు. పార్టీని నిలుపుకోవాలంటే తెలంగాణ కోసం ఉద్యమించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
TDP senior MLA Nagam Janardhan Reddy questioned telugudesam telangana forum on Chandrababu letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X