చంద్రబాబు లేఖ రాస్తే మేం తెలంగాణ తెస్తాం: ఎంపీ పొన్నం ప్రభాకర్
State
oi-Srinivas G
By Srinivas
కరీంగనర్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై కేంద్రమంత్రి చిదంబరానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు లేఖ రాస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చే బాధ్యత తమదేనని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని ఖరాఖండిగా చెప్పారు. అయితే చంద్రబాబు లేఖ మాత్రం రాస్తే మరింత సానుకూలత ఉంటుందన్నారు. రెండో ఎస్సార్సీకి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదన్నారు.
చంద్రబాబు లేఖ రాయకుండా టిడిపి ఆధ్వర్యంలో ఎన్ని సభలు పెట్టినా ఫలితం ఉండదన్నారు. ప్రతిపక్ష నేతగా తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టంగా కేంద్రానికి చెప్పాలని డిమాండ్ చేశారు.