వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగం దేవేందర్ గౌడ్‌లా అవుతారా, కెసిఆర్‌ను ఎదుర్కుంటారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తిరుగుబాటు చేసి బయటకు వచ్చి నవ తెలంగాణ పార్టీలో చేరి, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి, తెలుగుదేశంలోకి మళ్లీ వచ్చిన టి. దేవేందర్ గౌడ్‌లా తెలంగాణ ప్రాంతానికి చెందిన శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అవుతారనే మాట వినిపిస్తోంది. ఈ మాట ముఖ్యంగా తెలుగుదేశం వర్గాల నుంచి వస్తోంది. ఒక రకంగా నాగం జనార్దన్ రెడ్డిని భయపెట్టడానికి ఈ ప్రచారం ముందుకు వచ్చిందని చెప్పవచ్చు. దేవేందర్ గౌడ్ పరిస్థితి రాకుండా ఉండాలంటే నాగం జనార్దన్ రెడ్డి కచ్చితంగా తనదంటూ ఓ కార్యాచరణను రూపొందించుకోవాల్సి ఉంటుంది. నాగం జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీ పెడతారా, వేదికను పెడతారా, తెలంగాణ ఉద్యమంలో ఎలా ముందుకు సాగుతారనేది తెలియడం లేదు. ఆయన కూడా స్పష్టంగా చెప్పడం లేదు. అయితే, ఇప్పటికే ఓ ప్రణాళిక సిద్ధమైనట్లు మాత్రం అర్థమవుతోంది.

నాగం జనార్దన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట వెళ్తారని, వైయస్ జగన్ కోసం పనిచేస్తున్నారని తెలుగుదేశంలోని చంద్రబాబు అనుకూల తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు అంటున్నారు. కానీ, తెలంగాణపై స్పష్టంగా ముందుకు వస్తూ, దానిపైనే చంద్రబాబును ప్రశ్నిస్తూ వస్తున్న నాగం జనార్దన్ రెడ్డి వైయస్ జగన్ వైపు వెళ్తారని చెప్పడానికి తగిన ప్రాతిపదిక ఏదీ లేదు. వైయస్ జగన్ తెలంగాణకు అనుకూలంగా స్పష్టంగా వస్తేనే నాగం అటు వైపు వెళ్లే అవకాశాలుంటాయి. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి పాత్ర గురించి చెప్పాల్సి వస్తే కూడా అదే వర్తిస్తుంది.

నాగం జనార్దన్ రెడ్డి స్పష్టమైన వైఖరితో, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వస్తున్నారనేది మాత్రం అర్థమవుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై విసిగిపోయిన శ్రేణులు నాగం జనార్దన్ రెడ్డి వైపు వచ్చే అవకాశాలున్నాయి. అలాగే, తెలంగాణ ఉద్యమంలో ఇప్పటి వరకు రెడ్డి నాయకత్వం పాత్ర స్వల్పంగానే ఉంది. రెడ్లు కలిసి వస్తే తప్ప తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం బలోపేతం కాదనే అభిప్రాయం ఉంది. నాగం జనార్దన్ రెడ్డి ఈ ఖాళీని భర్తీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. కెసిఆర్‌ను ఢీకొట్టడానికి ముందుకు వస్తున్నారా, కెసిఆర్‌తో మిత్రవైరుధ్యాన్ని పాటిస్తూ దక్షిణ తెలంగాణలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రణాళికను అనుసరిస్తారా అనేది వేచి చూడాల్సిందే.

English summary
It is not known what stategy will be adopted by TDP Telangana MLA Nagam Janardhan Reddy after coming out of party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X