గోరంట్ల వద్దకు చంద్రబాబు దూత గరికపాటి, బుజ్జగింపు ప్రయత్నాలు

రాజమండ్రి మేయర్ తీరుపై బుచ్చయ్య చౌదరి తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాజమండ్రి మేయర్ అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా ఆయన అలక చెందినట్లుగా తెలుస్తోంది. పార్టీలో ప్రస్తుతం డబ్బులు ఉన్న వారికి, కొత్త వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా ఆయన అన్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు కూడా పార్టీ పరిస్థితిపై దృష్టి సారించలేని స్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన చెందినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు చుట్టూ కోటరీ ఉందని ఆ కోటరి చెప్పినట్టుగానే ఆయన నడుచుకోవడం వల్ల పార్టీ నష్ట పోయే పరిస్థితి తలెత్తుతోందని ఉద్దేశ్యంలో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది.