చంద్రబాబుకు వైయస్ జగన్ దెబ్బ, ఖాళీ అవుతున్న టిడిపి

తునిలో యనమల రామకృష్ణుడు తిష్ట వేసినట్లుగా పలు నియోజక వర్గాల్లో నాయకులు దస్తీలు వేసుకుని కూర్చుకున్నారు. దానికితోడు, వివిధ జిల్లాల్లో కొంత మంది నాయకుల ఆధిపత్య, ఏకపక్ష ధోరణులు మిగతా నాయకులు క్రియాశీలక పాత్ర వహించే వాతావరణాన్ని దెబ్బ తీస్తున్నాయి. ప్రకాశంలో కరణం బలరామ్, గుంటూరులో కోడెల శివప్రసాద రావు, విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు, శ్రీకాకుళం జిల్లాలో ఎర్రంనాయుడు - ఇలా చెప్పుకుంటే పోతే ఇటువంటి నాయకులు చాలా మందే ఉంటారు. దీంతో వారితో కలిసి పనిచేయడానికి అవకాశం లేని నాయకులు వైయస్ జగన్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో చిరంజీవి దెబ్బ తీసిన కన్నా ఘోరంగా వైయస్ జగన్‌ను ఈసారి చంద్రబాబును దెబ్బ తీసే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెసు ఓట్లు జగన్ వల్ల చీలుతాయని భావిస్తున్న చంద్రబాబుకు ఎదురు దెబ్బ తప్పేట్లు లేదు.












Click it and Unblock the Notifications