వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్సార్ కాంగ్రెసులో రోజాకు పెద్దపీట, విజయమ్మ గౌరవాధ్యక్షురాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Roja
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ప్రముఖ సినీ నటి, నాయకురాలు రోజాకు పెద్ద పీట వేశారు. వైయస్ జగన్‌ రోజాను దూరం పెట్టారనే వార్తలకు దీంతో తెర పడింది. పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో ఆమెకు స్థానం దక్కింది. అంతేకాకుండా పార్టీ అధికార ప్రతినిధిగా రోజాను నియమించారు. పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా వైయస్ విజయమ్మ, అధ్యక్షుడిగా వైయస్ జగన్ వ్యవహరిస్తారు. సెంట్రల్ గవర్నరింగ్ కౌన్సిల్‌ను 21 మందితో ఏర్పాటు చేశారు. ఈ జాబితాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత భూమా నాగిరెడ్డి ప్రకటించారు. సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో నలుగురు మహిళలకు చోటు దక్కింది.

సోమయాజులు, సిసి రెడ్డిని పార్టీ సలహాదారులుగా వేసుకున్నారు. పిఎన్‌వి ప్రసాద్ రాష్ట్ర సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఏడుగురు అధికార ప్రతినిధులను నియమించారు. రెహ్మాన్, జూపూడి ప్రభాకర రావు, బాజిరెడ్డి గోవర్ధన్, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, రోజా, గట్టు రామచంద్రరావు అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. మహిళా అధ్యక్షురాలిగా నిర్మలకుమారి ఎంపికయ్యారు. రాష్ట్ర యువజన నాయకుడిగా గుత్తా ప్రభాత్ రెడ్డిని వేశారు. విద్యార్థి విభాగం నాయకుడిగా మద్దినేని అజయ్ ఎంపికయ్యారు.

సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు - కొణతాల రామకృష్ణ, వైవి సుబ్బారెడ్డి, రెహ్మాన్, మహేందర్ రెడ్డి, జూపూడి ప్రభాకర రావు, రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, కంతి విశ్వనాథం, తోపుదుర్తి కవిత, గిరిరాజు నగేష్, బాజిరెడ్డి గోవర్ధన్, జ్యోతుల నెహ్రూ, సోమయాజులు, భూమా నాగిరెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మి, బాల మణెమ్మ, మూలింటి మారెప్ప, జంగ కృష్ణమూర్తి, మాకినేని పెదరత్తయ్య, మదన్ లాల్ నాయక్.

రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌గా జనార్దన్ రెడ్డి, నల్లగొండ జిల్లా కన్వీనర్‌గా సోమిరెడ్ిడి, నెల్రూరు జిల్లా కన్వీనర్‌గా గోవర్ధన్ రెడ్డి, విశాఖపట్నం అర్బన్ కన్వీనర్‌గా రవిరాజ్, విజయవాడ అర్బన్ కన్వీనర్‌గా జలీల్ ఖాన్, రాజమండ్రి అర్బన్ కన్వీనర్‌గా రాజ్ కపూర్ ఎంపికయ్యారు.

English summary
Roja gets important place in YSR Congress party. YS Vijayamma will act as honourary president for YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X