హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలో రెడ్లదే ఆధిపత్యం, నివురు గప్పిన నిప్పులా అసంతృప్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో రెడ్లకే పెద్ద పీట వేశారు. పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులను, జిల్లా కన్వీనర్లను నియమించారు. ఇందులో చాలా మంది కాంగ్రెసు నుంచి వచ్చినవారే ఉన్నారు. మొత్తం 23 జిల్లాలకు కన్వీనర్లను నియమించగా వారిలో 9 మంది రెడ్లు కావడం విశేషం. సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో కూడా అగ్రవర్ణాలకే ప్రాధాన్యం లభించింది. మాజీ శాసనసభ్యులకు, ప్రస్తుత శానససభ్యుల బంధువులకు కమిటీల్లో స్థానం కల్పించారు. ప్రభుత్వ సలహాదారుల పదవులకు రాజీనామా చేసిన సోమయాజులు, సిసి రెడ్డిలను జగన్ పార్టీ సలహాదారులుగా నియమించుకున్నారు.

కాగా, కమిటీల నియామకంపై వైయస్సార్ పార్టీలో అసంతృప్తి చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి నుంచి తన వెంట ఉంటూ, కాంగ్రెసు పార్టీని ధిక్కరిస్తూ వస్తున్న అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు, రాజ్ ఠాకూర్‌లకు తగిన ప్రాధాన్యం లభించలేదనే మాట వినిపిస్తోంది. అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు పాత్రను వైయస్ జగన్ కుదించారు. వారిని అధికార ప్రతినిధుల పాత్రకు మాత్రమే పరిమితం చేశారు. రోజాకు మహిళా అధ్యక్ష పదవిని అప్పగించలేదు. కానీ, సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్‌లోకి ఆమెను తీసుకున్నారు. రాజ్ ఠాకూర్‌ను కరీంనగర్‌కే పరిమితం చేశారు.

కాంగ్రెసును ఎదిరించి నిలిచినవారిని పక్కన పెట్టి గత్యంతరం లేక పార్టీలోకి వచ్చివారికి వైయస్ జగన్ ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, నల్లగొండ జిల్లా కన్వీనర్‌గా సోమిరెడ్డిని నియమించడాన్ని రవీందర్ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఏమైనా, ఈ కమిటీల నియామకం ఎటు దారి తీస్తుందో చెప్పలేమని అంటున్నారు.

English summary
YSR Congress president Jaganmohan Reddy on Thursday appointed members to the party governing council and district convenors. The hallmark of these appointments are that most of the appointees are Congress leaders and the list is dominated by members of the Reddy community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X