వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రబాబుతో వైయస్ జగన్ కుమ్మక్కయ్యారు: డిఎల్ రవీంద్రా రెడ్డి

వైయస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు వైయస్ జగన్‌కు 150 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని, అది ఇప్పుడు 30కి పడిపోయిందని, అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే అది మూడుకో సున్నాకో పడిపోతుందని ఆయన అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఊసే లేదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయిన తెలుగుదేశం పార్టీకి ఎన్ని మహానాడులు నిర్వహించుకున్నా ఫలితం ఉండదని ఆయన అన్నారు.
అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి ప్రభుత్వాన్ని పడగొట్టలేరని కాంగ్రెసు శాసనసభ్యుడు వీరశివా రెడ్డి అన్నారు. దమ్ముంటే అవిశ్వాసం ప్రతిపాదించాలని ఆయన జగన్‌ను సవాల్ చేశారు. గవర్నర్ వద్దకు వెళ్లి జగన్ లేఖ ఇవ్వాలని ఆయన అన్నారు. 2014 వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి డోకా లేదని ఆయన దీమా వ్యక్తం చేశారు.