వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విసిగించకండి: చంద్రబాబు పనితీరుపై హరికృష్ణ గరం గరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Harikrishna
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ శనివారం మహానాడులో సీతయ్య అవతారమెత్తారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై పార్టీ నాయకుల మద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మనోవేదనను పార్టీ నాయకుల వద్ద వెళ్లబోసుకున్నారు. మహానాడులో మాట్లాడాలని పార్టీ నాయకులు కె. ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు చేసిన విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. తాను మాట్లాడలేనని, తనను విసిగించవద్దని ఆయన వారితో అన్నారు. తాను మాట్లాడకపోవడానికి కారణాలు తర్వాత చెప్తానని ఆయన అన్నారు.

చంద్రబాబు నాయుడు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఎవరి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. చంద్రబాబు ఏకపక్ష ధోరణి వల్ల పార్టీ నష్టపోతోందని ఆయన అన్నారు. తాను వారసత్వ పోరు గురించి మాట్లాడడం లేదని, పార్టీని రక్షించుకోవాలన్నదే తన ఉద్దేశమని ఆయన అన్నారు. కరీంనగర్ రణభేరీని ఎప్పుడో నిర్వహించాలని తాను సూచించినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. పులివెందులలో వైయస్ విజయమ్మపై పోటీకి దిగకూడదని, జగన్‌పై పోరాటం చేయాలని చెప్పానని, తన మాటలను పట్టించుకోలేదని ఆయన అన్నారు.

మీడియా ప్రతినిధులతో మాట్లాడడానికి కూడా హరికృష్ణ నిరాకరించారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వల్ల తాను మాట్లాడలేనని ఆయన అన్నారు. తాను మాట్లాడకపోవడానికి కారణాలు తర్వాత చెప్తానని ఆయన అన్నారు. మహానాడులో ఆయన ముభావంగానే ఉన్నారు. మొదటి రోజు కూడా మహానాడు నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. మహానాడు వేదికపై హరికృష్ణ ఫొటో కనిపించలేదు.

English summary
TDP Rajyasabha member Harikrishna rejected to speak at Mahanadu. He said that he can not speak and the reasond will be revealed afterwards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X