గాలి కూర్చునేది బంగారం కుర్చీలో, తినేది బంగారు పల్లెంలో

ఆ వివరాలన్నీ కర్ణాటక లోకాయుక్తకు సమర్పించినవేనని ఆ పత్రిక రాసింది. 2010 మార్చి 31వ తేదీ వరకు తనకు గల ఆస్తుల వివరాలను గాలి జనార్దన్ రెడ్డి 2010 జూన్ 25వ తేదీన లోకాయుక్తకు సమర్పించారు. గాలి జనార్దన్ రెడ్డికి గల ఆభరణాల జాబితా మూడు పేజీల నిండా ఉంది. వాటి విలువ కోట్లాది రూపాయలు ఉంటుంది. ఎన్నో సెట్ల గాజులు, పచ్చ సఫైర్ స్టోన్, ర్యూబీ, బంగారు పరికరాలు, నెక్లెస్‌లు, చెవి పోగులు, పురుషుల ఆభరణాలు, రింగులు, బంగారు విగ్రహాలు - ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
ఎయిర్ కండీషనర్స్, టీవీ సెట్లు, ఫర్నీచర్ - ఇంటి వస్తువుల విలువ లక్షలాది రూపాయలు ఉంటుంది. వ్యవసాయ భూములు, భవనాలను, వారసత్వ ఆస్తులను మినహాయిస్తేనే గాలి జనార్దన్ రెడ్డి ఆస్తులు 153.49 కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ఆయన నెజీతం రూ. 31.54 కోట్లు కాగా, వాణిజ్య ఆదాయం రూ. 18.30 కోట్లు.












Click it and Unblock the Notifications