ధర్మాన సోంపేట పర్యటన ఉద్రిక్తం: సాయిరాజ్ సతీమణి అరెస్టు

Dharmana Prasad Rao
శ్రీకాకుళం: మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లా పర్యటన ఉద్రిక్తంగా మారింది. జిల్లాలోని సోంపేటలో ప్రభుత్వం తలపెట్టిన థర్మల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సోమవారం సోంపేటలో పర్యటిస్తున్న మంత్రి ధర్మానను అడ్డుకోవాలని పర్యావరణ పరిరక్షణ సమితి నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం బంద్‌కు పిలుపునిచ్చింది. మంత్రిని అడ్డుకోవాలని నిర్ణయించింది. మంత్రిని అడ్డుకోవాలని పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు, సోంపేట థర్మల్ ప్రాజెక్టు బాధితులు, విపక్షాలు మంత్రి పర్యటన అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టాయి.

పలువురు ఆందోళనకారులు గూడ్సు రైలును అడ్డుకున్నారు. మంత్రి పర్యటనను అడ్డుకోవాలని ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే సాయిరాజ్ సతీమణి, తల్లిదండ్రులతో పాటు పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి ధర్మాన పర్యటనను అడ్డుకోవద్దని పోలీసులు పర్యావరణ పరిరక్షణ సమితి కార్యకర్తలతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+