నేడో రేపో గవర్నర్‌కు రాజీనామా ఇవ్వనున్న జూపల్లి కృష్ణారావు

కాగా అంతకుముందు ఉదయం కూడా ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను గతంలోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాజీనామా పత్రాన్ని సమర్పించానని అయితే మంత్రులపై ఒత్తిడి పెరుగుతుందనే ముఖ్యమంత్రి తన రాజీనామాను ఆమోదించలేదన్నారు. తన పాదయాత్ర తెలంగాణ కోసమే అన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తన పాదయాత్ర అవసరం లేదన్నారు. మంత్రుల రాజీనామాతో అధిష్టానం దిగి వస్తుందన్నారు. పాదయాత్ర ప్రజాస్వామ్య హక్కు అన్నారు. తన పాదయాత్రను ఎవరికీ అడ్డుకునే హక్కు లేదని డికె అరుణను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ విషయంలో అధిష్టానం తప్పు ఏమీ లేదన్నారు.












Click it and Unblock the Notifications