లోక్‌పాల్ బిల్లుపై ప్రభుత్వం తిరకాసు, అన్నా హజారేకు టోకరా

సోమవారం ముసాయిదా కమిటీ సమావేశంలో పౌర సమాజ సభ్యులు చేసిన కీలక ప్రతిపాదనలన్నీ తోసిపుచ్చింది. పైగా, ఆ ప్రతిపాదనలపై రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం కోరుతూ లేఖలు రాయాలని నిర్ణయించింది. సమావేశం అనంతరం అన్నాహజారే సహా పౌర సమాజ సభ్యులు కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ''మరో దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధంగా ఉండాలి. మరికొన్ని భేటీల వరకు వేచిచూస్తాం. ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు చేతనైనంత మేరకు ప్రయత్నిస్తాం. అంగీకరించకపోతే వీధులకు ఎక్కుతాం'' అని పౌర సమాజ సభ్యులు రెండు పుటల ఘాటైన ప్రకటనలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వానికి తాము పెట్టిన జూన్ 30 గడువులోగా ముసాయిదా రచన పూర్తవుతుందన్న నమ్మకం కలగడం లేదని హజారే చెప్పారు. ప్రభుత్వం తమ ప్రతిపాదనలను వ్యతిరేక దృష్టితో చూస్తోందని, శత్రుభావంతో వ్యవహరిస్తోందని విమర్శించారు.












Click it and Unblock the Notifications