తెలంగాణ టిడిపి నేతలకు నాకు పట్టిన గతే: నాగం జనార్దన్ రెడ్డి

30వ మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన మనసులోని మాటను బయట పెట్టారన్నారు. ఆయన సమైక్యవాది అని మరోసారి బయట పడిందన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తనకు అభ్యంతరం లేదన్న చంద్రబాబు గత డిసెంబర్ 9న కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఒక్కరోజులో ఎందుకు విభేదించారని ప్రశ్నించారు. తెలంగాణ అంశం మా చేతుల్లో లేదన్న తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణపై ఇప్పటికే స్పష్టత ఇచ్చామని చెబుతున్న బాబు శ్రీకృష్ణ కమిటీకి పార్టీ విధానం ఏమిటో తెలియజేయలేదన్నారు.












Click it and Unblock the Notifications