వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యుపిఏకు రామ్‌దేవ్ బాబా తలనొప్పి: జూన్ 4నుండి అవినీతిపై దీక్ష

అయితే అనంతరం ఆయన పలు డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లి వాటికి కేంద్రం ఆమోద ముద్ర వేస్తే దీక్షపై మరోసారి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అయితే తదనంతర పరిణామాల నేపథ్యంలో బాబా దీక్షకు పూనుకున్నారు. తన దీక్షకు అన్నాహజారే మద్దతు ఉంటుందని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా దీక్షను కొనసాగిస్తానని చెప్పారు. అయితే దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ గల బాబా దీక్ష చేస్తే మరింత సంకట పరిస్థితి కేంద్రానికి ఏర్పడుతుందన్న ఉద్దేశ్యంతో కాంగ్రెసు ఉంది. దీంతో రామ్ దేవ్ బాబాచే దీక్ష విరమింప చేయడానికి ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకు పలువురు సీనియర్ కాంగ్రెసు నేతలు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.