వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ పదవిపై సోనియా గాంధీ నాతో మాట్లాడలేదు: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
న్యూఢిల్లీ: తనకు గవర్నర్ పదవి ఇచ్చే విషయంపై తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చించలేదని మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు. సోనియా గాంధీతో సమావేశమైన అనంతరం ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనకు గవర్నర్ పదవి ఇవ్వడానికే తనను ఢిల్లీకి ఆహ్వానించారని వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని ఆయన అన్నారు. అయితే, సోనియాతో ప్రధానంగా ఇదే చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. తనపై ఉన్న హైదరాబాదులోని అమీర్‌పేట భూముల కేసుపై మాట్లాడడానికి తాను ఢిల్లీ రాలేదని ఆయన చెప్పారు. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో ఉందని, దానిపై మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోశయ్య అమీర్‌పేటలోని విలువైన ప్రభుత్వ భూమిని తనకు కావాల్సిన వారికి కట్టబెట్టారనే ఆరోపణపై ఎసిబి కోర్టులో కేసు నడుస్తోంది.

రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సోనియా తనతో మాట్లాడారని, పార్టీ పరిస్థితిపై తాను రాసిన లేఖ అందిందని సోనియా తనతో చెప్పారని రోశయ్య అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి)ని పునర్వ్యస్థీకరించాల్సిన అవసరం ఉందని సోనియా భావిస్తున్నారని, ఆ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారని ఆయన అన్నారు. సోనియాతో మాట్లాడిన అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాలనుకుంటే తానే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉండేవాడినని ఆయన అన్నారు. సోనియాతో మాట్లాడిన అన్ని విషయాలూ వెల్లడించడానికి వీలు కాదని ఆయన చెప్పారు. పిసిసి అధ్యక్షుడి నియామకం ఏ రోజు చేస్తారని తాను సోనియాను అడగలేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే విషయంపై సోనియా తనతో మాట్లాడారని ఆయన అన్నారు.

English summary
Former CM K Rosaiah said that Sonia Gandhi has not spoken about governor post. He said that she spoke about party situation in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X