మారుతి కారు అద్దాలు పగులగొట్టి రూ.2 లక్షలు దొంగతనం
Districts
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: రాజధానిలో మరోసారి మిట్టమధ్యాహ్నం నడిరోడ్డు పైన దొంగతనం జరిగింది. హైదరాబాదులోని కార్ఖాన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఈ చోరీ జరిగింది. నాగరాజు అనే ఓ వ్యాపారి తన మారుతి కారులో ఎస్‌బిఐకి వచ్చాడు. ఆయన రెండు లక్షల రూపాయలు డ్రా చేసుకొని వెళ్లి తన కారులో పెట్టాడు. ఆ తర్వాత ఏదో పనిపై మరోసారి బ్యాంకులోకి వెళ్లాడు. అయితే దీనిని అక్కడే ఉన్న వారు ఎవరో గమనించి, నాగరాజు లోపలకు వెళ్లగానే కారు అద్దాలు పగులగొట్టి రూ.2 లక్షలను దోచుకొని వెళ్లారు.
నాగరాజు తిరిగి వచ్చి చూసే సరికి కారు అద్దాలు పగుల గొట్టి ఉండి లోన ఉన్న డబ్బులు కూడా పోయాయి. దీంతో అతను పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.