అంబటి రాంబాబుకు మరో షాక్ ఇచ్చిన జగన్, పక్కన పెట్టినట్లే

Ambati Rambabu
హైదరాబాద్: మొదటి నుంచి తన వెంట ఉంటున్న తమ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మరో షాక్ ఇచ్చారు. పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్‌లోకి తీసుకోకుండా అధికార ప్రతినిధి హోదాకు మాత్రమే జగన్ పరిమితం చేశారు. ఇప్పుడు పార్టీ జిల్లా ఇంచార్జీల సమావేశానికి ఆహ్వానించకుండా అంబటి రాంబాబుకు మరో షాక్ ఇచ్చారు. తనను పరిమితం చేయడంపై స్పందిస్తూ అంబటి రాంబాబు ఇటీవల మీడియా ప్రతినిధులతో - తాను జగన్ మనసులో ఉన్నానని చెప్పుకున్నారు. కానీ, పరిస్థితి చూస్తుంటే అంబటి రాంబాబు జగన్ మనసులో లేరని అర్థమవుతోంది.

పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించడానికి వైయస్ జగన్ బుధవారం తన నివాసంలో జిల్లా ఇంచార్జీలతో, పార్టీ అధికార ప్రతినిధులతో, పార్టీ పరిశీలకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అంబటి రాంబాబును జగన్ ఆహ్వానించలేదు. దీన్ని బట్టి వైయస్ జగన్ అంబటి రాంబాబును పక్కన పెట్టినట్లేనని భావిస్తున్నారు. అంబటి రాంబాబును పక్కన పెట్టడానికి గల కారణమేమిటో తెలియడం లేదు. అంబటి రాంబాబు మీడియాలో తరుచుగా కనిపిస్తూ పెద్ద యెత్తున ఫోకస్ అవుతున్నారు. ఇది నచ్చకనే జగన్ అంబటిని పక్కన పెట్టి ఉంటారనే అనుమానాలవు వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+