చంద్రబాబు నేర్చుకో, నువ్వే చరిత్ర తెల్సుకో: మల్లు రవి వర్సెస్ కడియం
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: కాంగ్రెసు సీనియర్ నాయకుడు మల్లు రవి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన విమర్శకు ఆ పార్టీ మాజీ మంత్రి కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో స్పందించారు. ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెసు పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని తమను చూసి చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో కూడా వారికి ప్రధాన్యత కల్పించాలని మల్లు రవి శుక్రవారం డిమాండ్ చేశారు. ముఖ్యమైన పదవులలో ఎస్సీ, ఎస్టీలను కూర్చుండ బెట్టాలని ఆయన చంద్రబాబుకు సూచించారు. టిడిపి కిందిస్థాయి వర్గాలను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు.
మల్లు రవి వ్యాఖ్యలపై కడియం శ్రీహరి ధీటుగా స్పందించారు. మల్లు రవి మొదట చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం కల్పించింది మొదట టిడిపియే అన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెసు పార్టీయే ఆ వర్గాలను నిర్లక్ష్యం చేసిందని అన్నారు.