ప్రజల వైపో, ప్రభుత్వం వైపో జగన్ తేల్చుకోవాలి: పయ్యావుల కేశవ్

Payyavula Keshav
హైదరాబాద్: ప్రజల వైపు ఉంటాడో, ప్రభుత్వం వైపు ఉంటాడో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తేల్చుకోవాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ప్రభుత్వాన్ని పడగొడతానని చెప్పిన జగన్ తన మాటను నిలబెట్టుకుని విశ్వసనీయతను నిరూపించుకోవాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ పార్టీ సస్పెండ్ అయిన నాగం జనార్దన్ రెడ్డి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తమ పార్టీ విప్‌ను నాగం జనార్దన్ రెడ్డి గౌరవించాల్సిందేనని, నాగం సస్పెండ్ అయ్యారే తప్ప బహిష్కరణకు గురి కాలేదని ఆయన అన్నారు.

పార్టీ విప్‌ను గౌరవించి నాగం జనార్దన్ రెడ్డి శాసనసభకు వచ్చి ఓటింగులో పాల్గొనాలని ఆయన అన్నారు. ఓటు ఎవరికి వేశారనేది తర్వాతి విషయమని ఆయన అన్నారు. స్పీకర్ ఎన్నికకు హాజరు కావాలని పార్టీ విప్ దూళిపాళ్ల నరేంద్ర చౌదరి నాగం జనార్దన్ రెడ్డికి ఎస్ఎంఎస్ పంపించారు. పార్టీ శానససభ్యులకు ఆయన విప్ జారీ చేశారు. పార్టీ నీడలో ఉన్నప్పుడు ఎవరినైనా గుర్తిసామని పయ్యావుల కేశవ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+