జగన్ వర్గం ఎమ్మెల్యేల మద్దతు కోరిన శ్రీధర్ బాబు, పిల్లి సుభాష్‌కు ఫోన్

ఇదే విషయమై తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఫోన్లో సంభాషించడానికి ప్రయత్నించానని, ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్‌తో మాట్లాడానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో సహకరించాలని పయ్యావులను కోరానని, దీనిపై స్పందించిన ఆయన పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించి చెప్తామని కేశవ్ తెలిపినట్లు చెప్పారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రోటెం స్పీకర్ అంగీకరించకపోవడంతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు పోటీ పడాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీకి వామపక్షాలు మద్దతు పలుకుతున్నాయి. స్పీకర్ ఎన్నిక విషయంలో తెలుగుదేశం పార్టీకి సహకరించేది లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తేల్చి చెప్పింది.