అవిశ్వాసంపై వ్యూహరచనకు రేపు జగన్ వర్గం ఎమ్మెల్యేల భేటీ

YS Jagan
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై తాము అనుసరించాల్సిన వ్యూహాన్ని రేపు శనివారం ఖరారు చేసుకుంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి చెప్పారు. శాసనసభ్యురాలిగా వైయస్ విజయమ్మ చేసిన ప్రమాణ స్పీకార కార్యక్రమానికి హాజరైన ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాము సమావేశమై చర్చించుకోకుండా అవిశ్వాస తీర్మానంపై అనుసరించే వ్యూహంపై ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ గురువారం ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు అనుమతి పొందే అవకాశం లేదని, మళ్లీ నోటీసు ఇస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారని, ఏం చేయాలనే విషయంపై అప్పుడు చూస్తామని ఆయన అన్నారు. తప్పనిసరి పరిస్థితి వస్తే ఏం చేయాలనేది చూస్తామని ఆయన అన్నారు. స్పీకర్ పదవికి అభ్యర్థిని పోటీకి దించవద్దని ఆయన తెలుగుదేశం పార్టీకి సూచించారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+