బాబు, నాగం ఎడమొహం, పెడమొహం: తెలంగాణ ప్లకార్డు ప్రదర్శన
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, సస్పెండ్ అయిన పార్టీ శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి శనివారం శానససభలో ఎడమొహం, పెడమోహంగా వ్యవహరించారు. వారిద్దరు పక్క పక్క సీట్లలోనే కూర్చుకున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సందర్భంగా నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ ప్లకార్డు ప్రదర్శించారు. నాగం జనార్దన్ రెడ్డి తన పాత సీటులోనే శాసనసభలో కూర్చున్నారు. స్పీకర్ ఎన్నికలో నాగం జనార్దన్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ అసమ్మతి శాసనసభ్యులు జోగు రామన్న, హరీశ్వర్ రెడ్డి పార్టీ అభ్యర్థఇ కెఇ కృష్ణమూర్తికి ఓటేశారు.
డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో మాత్రం వారు ముగ్దురు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుద్దాల దేవయ్యకు కాకుండా అధికార కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మల్లుభట్టి విక్రమార్కకు ఓటేశారు. నాదెండ్ల మనోహర్ కన్నా డిప్యూటీ స్పీకర్ పదవికి పోటీ చేసిన మల్లుభట్టి విక్రమార్కకు ఆరు ఓట్లు ఎక్కువగా వచ్చాయి. డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో తెలుగుదేశం స్పీకర్ అభ్యర్థి కెఇ కృష్ణమూర్తి కన్నా డిప్యూటీ స్పీకర్ అభ్యర్థి సుద్దాల దేవయ్యకు రెండు ఓట్లు తక్కువగా వచ్చాయి. సిపిఐ, బిజెపి, లోకసత్తా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి.