హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, అవిశ్వాసం నెగ్గడానికి ప్లాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని ఓడించడానికి కాంగ్రెసు పార్టీ పకడ్బందీ ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. స్పీకర్ ఎన్నికను సజావుగా నిర్వహించుకోవడం ఇందుకు ప్రాతిపదికగా చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వైపు దాదాపు 40 మంది శానససభ్యులు వెళ్తే ప్రభుత్వం పడిపోతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాన్ని దెబ్బ తీయడానికి కాంగ్రెసు పార్టీ నాయకత్వం వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. జగన్ వర్గానికి చెందిన దాదాపు 15 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేయడం ద్వారా అవిశ్వాస తీర్మానాన్ని ఓడించాలనేది కాంగ్రెసు వ్యూహంగా కనిపిస్తోంది.

వైయస్ జగన్ వైపు వెళ్తున్నవారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి ముప్పు వస్తుందనే ఉద్దేశంతో అనర్హత వేటు ద్వారా జగన్ వర్గానికి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలను అవిశ్వాస తీర్మానానికి దూరం చేయాలనేది ఆ వ్యూహంగా చెబుతున్నారు. ఇప్పటికే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డిలపై తెలుగుదేశం పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. జగన్ వెంట వెళ్తున్న దాదాపు 15 మంది శాసనసభ్యులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసి వారిపై అనర్హత వేటు పడేలా చూడబోతున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అవిశ్వాస తీర్మానం శానససభలో చర్చకు వచ్చేలోగా ఈ పని పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

కాగా, స్పీకర్ ఎన్నికకు సహకరించడం ద్వారా తాము పార్టీ వెంట ఉన్నట్లు ప్రదర్శించుకుని అవిశ్వాస తీర్మానంపై ప్రధాన దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో వైయస్ జగన్ వర్గం ఉంది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగు జరిగే సమయానికి దాదాపు 40 మంది కాంగ్రెసు శాసనసభ్యులను కూడగట్టాలనే ఉద్దేశంతో వైయస్ జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన వెంట కచ్చితంగా 25 మంది శానససభ్యులున్నారు. మరో పది మంది దాకా మద్దతు ఇచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానం సమయంలో తమ సత్తా ఏమిటో చూపాలని వారు అనుకుంటున్నారు. దీన్ని దెబ్బ కొట్టడానికి కాంగ్రెసు నాయకత్వం అనర్హత వేటు వేసి సభా బలాన్ని తగ్గించి గట్టెక్కాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
It is said that Congress leadership is in a plan to make disqualify YSR Congress party MLAs before No Confidence motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X