తెలంగాణ అంశంపై ప్రభుత్వం మీద నాగం అవిశ్వాస తీర్మానం నోటీసు
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: తెలంగాణ అంశంపై ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని తెలుగుదేశం నుంచి సస్పెండ్ అయిన శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నోటీసు ఇస్తున్నట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఈ నోటీసుపై తెలుగుదేశం అసమ్మతి శాసనసభ్యులు హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న కూడా సంతకాలు చేశారు. దీనికి సంబంధించిన ప్రతిపై తెలంగాణకు చెందిన శాసనసభ్యుల చేత సంతకాలు చేయించి, మరో నోటీసు ఇప్పించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు నాగం జనార్దన్ చెప్పారు.
తెలంగాణపై మాట మార్చడం ద్వారా ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆనయ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రభుత్వం అడ్డం తిరిగిందని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ చేస్తూ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. తాను, జోగు రామన్న తెలుగుదేశం పార్టీలోనే ఉన్నామని, స్పీకర్ ఎన్నికలో తాము తెలుగుదేశం పార్టీకే ఓటేస్తామని హరీశ్వర్ రెడ్డి చెప్పారు.