సిఐడి మహిళా డిఎస్‌పి ఆత్మహత్య, చిత్తూరు జిల్లాలో విషాదం
State
oi-Pratapreddy
By Pratap
|
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. సిఐడి మహిళా డిఎస్‌పి హేమలత ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామం దుర్గ సముద్రంలోని తన నివాసంలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ గ్రామం తిరుపతి శివారులో ఉంటుంది. హేమలత ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని సిఐడి విభాగంలో పనిచేస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియడం లేదు. అయితే అధికారుల వేధింపులు కారణమై ఉండవచ్చుననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరో కారణం కూడా ప్రచారంలో ఉంది. కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చుననేది మరో కారణం.
హేమలత 1989 బ్యాచ్‌కు చెందిన అధికారి. తొలుత ఆమె తిరుపతి అలిపిరి పోలీసు స్టేషనులో ఎస్ఐగా పనిచేశారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లా సిఐడి విభాగంలో డిఎస్‌పిగా పనిచేశారు. ఆమె సమర్థత గల అధికారి అని, పారదర్శకంగా వ్యవహరించేవారని అంటారు. మొహమాటాలు లేకుండా ముక్కుసూటిగా వ్యవహరించేవారని చెబుతారు.