హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ ప్రోరోగ్: జగన్, సిఎం కిరణ్ రాజకీయ కుట్ర అన్న టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తున్నట్లు గవర్నర్ నరసింహన్ మంగళవారం మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తున్నట్లు నోటీఫికేషన్ విడుదలయ్యాక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అసెంబ్లీ ప్రోరోగ్ చేయడం వెనుక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ నరసింహన్, సభాపతి నాదెండ్ల మనోహర్ రాజకీయ కుట్ర ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేదని టిడిపి ప్రశ్నించింది.

అవిశ్వాస తీర్మానాన్ని ఇంతటితో వదిలేది లేదని వచ్చే సమావేశాలలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే అవిశ్వాస తీర్మానంపై చర్చ రాకుండా జగన్, ముఖ్యమంత్రి కుట్ర చేశారనే ఆరోపణలకు విరుద్దంగా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ స్పందిస్తోంది. అవిశ్వాస తీర్మానం పెడితే తాము తమ సత్తా చూపిస్తామని జగన్ వర్గం ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

English summary
Telugudesam party blamed YSR Congress party president YS Jaganmohan Reddy and CM Kiran Kumar Reddy for assembly prorogue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X