వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వెళ్లడం కాంగ్రెసుకు నష్టమే, తెలంగాణపై కట్టుబడి ఉన్నా: బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
న్యూఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీని వీడి బయటకు వెళ్లడం పార్టీకి కొంత మేర నష్టమే అని దానిని భర్తీ చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు. నిన్నటి జగన్ వేరు నేటి జగన్ వేరు అని ఆయన అన్నారు. జగన్ ఇప్పుడు ఓ పార్టీకి అధ్యక్షుడు అని చెప్పారు. సిద్దాంత పరంగా విపక్షాలు అన్నింటినీ ఒకే దృష్టితో చూస్తామని చెప్పారు. రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పడితే తప్పులేదన్నారు. పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. తెలంగాణపై నా అభిప్రాయం అధిష్టానానికి వివరిస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆలస్యానికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ యుటర్న తీసుకోవడమే కారణం అని ఆయన ఆరోపించారు. తెలంగాణ అంశం చాలా సున్నితమైనదని చెప్పారు.

తాను మంత్రి పదవిలో ఉండాలా వద్దా అని సోనియాగాంధీ నిర్ణయిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తనకు విభేదాలు ఉన్నాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. విభేదాలు ఇక ముందు కూడా రావనే ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇద్దరం సమన్వయంతో కలిసి పని చేస్తామని చెప్పారు. నా ప్రాంతానికి గుర్తింపు లేదనే మంత్రిత్వ శాఖలపై అసంతృప్తితో ఉన్నానని ఆయన చెప్పారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్న వారిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెసులో క్రమశిక్షణ ముఖ్యమని అన్నారు. పార్టీలో సమన్వయలోపం అపోహలున్నాయని వాటిని తొలగించడమే తన ముందున్న ప్రథమ కర్తవ్యం అన్నారు. పిసిసి చీఫ్గా నా స్టైల్ కచ్చితంగా ఉంటుందని చెప్పారు.

తాను సమర్థుడను అయినందువల్లే తనను పిసిసి చీఫ్‌గా అధిష్టానం నియమించిందని తాను భావిస్తున్నానని, పార్టీ ఆశను వమ్ము చేయనన్నారు. కాంగ్రెసు పార్టీ ఎప్పుడూ సామాన్య కార్యకర్తలదే అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై తాను ఇది వరకు చెప్పిన మాటలకే కట్టుబడి ఉన్నానని చెప్పారు. అయితే తెలంగాణపై అంతిమ నిర్ణయం మాత్రం అధిష్టానానిదే అని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షుడి డి శ్రీనివాస్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

English summary
PCC chief Botsa Sathyanarayana said today that Congress party is getting some problem with YS Jagan issue. He said he will strengthen party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X