వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వాన్ని క్షమించాను: యోగా గురు బాబా రామ్‌దేవ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Baba Ramdev
హరిద్వార్‌: నల్లధనంపై దీక్ష చేస్తున్న యోగా గురు బాబా రామ్‌దేవ్ తాను ప్రభుత్వాన్ని క్షమించానని అన్నారు. రామ్ లీలా మైదానంలో తన పట్ల, తన అనుచరుల పట్ల వ్యవహరించిన పద్ధతికి తాను ప్రభుత్వాన్ని క్షమిస్తున్నానని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తన పట్ల, వేలాది తన అనుచరుల పట్ల పోలీసులు కిరాతకంగా వ్యవహరించారని, తన హత్యకు కుట్ర చేశారని, వ్యక్తిగతంగా తాను వారిని క్షమిస్తున్నానని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్యానికి తెచ్చిన మచ్చకు వారిని దేశ, ప్రపంచ చరిత్ర ఎన్నటికీ క్షమించదని ఆయన అన్నారు. తన పట్ల, తన అనుచరుల పట్ల జరిగిన దౌర్జన్యానికి సంబంధించిన సాక్ష్యాలను రూపుమాపడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు ఏ తప్పూ చేయకపోతే తమ కార్యకర్తల నుంచి సిసిటివీ ఫుటేజ్‌ను లాక్కుని ఉండేవారు కారని ఆయన అన్నారు. తమ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని ఆయన విమర్శించారు. పోలీసులు తమ అనుచరులను కొట్టి వెనక్కి పంపారని, పోలీసుల దాడిలో వేలాది మంది గాయపడ్డారని ఆయన అన్నారు. బాబా రామ్‌దేవ్ తన దీక్షను హరిద్వార్‌లో కొనసాగిస్తున్నారు.

English summary
Yoga guru Baba Ramdev, who is continuing his fast against corruption in Haridwar, on Tuesday said he had forgiven the government for the action against him and his supporters at Ramlila ground in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X