సూపర్ టేస్టీ 'కారా బూందీ'.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి..!

కారాబూందీ అంటే పిల్లలతోపాటు పెద్దలు కూడా ఇష్టపడతారు. కారా బూందీని చాలామంది బయట షాపుల్లో కొనుగోలు చేస్తారు. కానీ ఇంట్లోనే ఈజీగా బూందీని తయారు చేసుకోవచ్చు. అయితే కారాబూందీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఎలా తయారు చేయాలి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.. కారాబూందీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే శనగపిండి ఒక కప్పు, బియ్యం పిండి అర కప్పు, నూనె(బూందీ వేయించడానికి) తగినంత, వేరుశనగ పప్పులు అర కప్పు, పుట్నాల పప్పు పావు కప్పు, జీడిపప్పు పావు కప్పు, కరివేపాకు ఒక రెబ్బ, కారం పొడి ఒక టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, వాము అర టేబుల్ స్పూన్, నీళ్లు తగినంత(పిండి కలుపుకోవడానికి) తీసుకోవాలి.

కారా బూందీ తయారీ విధానం చూస్తే.. ముందుగా శనగపిండి, బియ్యం పిండిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో పసుపు, వాము, ఉప్పు, కొద్దిగా నూనె వేసి కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో తగినంత నీరు పోయాలి. జారే మాదిరిగా పిండి మిశ్రమాన్ని తయారు చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నూనె పోసి వేడి చేయాలి. వేడి నూనెలో బూందీ గరిటతో పిండిని వేసి కరకరలాడేంత వరకూ వేయించుకోవాలి.

KaraBoondi at Home Simple Ingredients and Easy Method for Perfect Crispy Snack KaraBoondi recipes

అలా అయిన తర్వాత తీసేయాలి. ఇప్పుడు అదే నూనెలో వేరుశనగపప్పులు, పుట్నాలు, జీడిపప్పు, కరివేపాకులను విడివిడిగా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేయించిన బూందీ, పప్పులు, కరివేపాకులను కలిపి, కారం పొడి చల్లుకోవాలి. అంతే సూపర్ టేస్టీ కారా బూంది రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+